ePaper
Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణకరీంనగర్అనాథ చిన్నారులకు డాక్టర్‌ మహేష్‌ రెడ్డి భరోసా  పిల్లల చదువు, వైద్య బాధ్యతలు స్వీకరిస్తానని...

అనాథ చిన్నారులకు డాక్టర్‌ మహేష్‌ రెడ్డి భరోసా  పిల్లల చదువు, వైద్య బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటన

📰 Generate e-Paper Clip

 

జనోదయ  చొప్పదండి ఏప్రిల్ 17 :

మండలంలోని చాకుంట గ్రామానికి చెందిన ఇద్దరు అనాథ చిన్నారులను ఆదుకునేందుకు కరీంనగర్ వన్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ మర్రి మహేష్‌ రెడ్డి ముందుకొచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆదిత్య, శ్రీనివాస్‌ అనే ఇద్దరు సోదరుల దైన్య స్థితిని తెలుసుకున్న ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుల ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని సమీక్షించిన డాక్టర్‌, ఆ పిల్లల పూర్తి విద్యా, వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న చిన్నారులను అక్కున చేర్చుకున్న డాక్టర్‌ మహేష్‌ రెడ్డి ఉదారతపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చిన్నారుల పట్ల చూపిన ఈ మానవతా దృక్పథం సమాజంలో సానుకూల సందేశాన్ని పంపుతోందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మర్రి మహేష్‌ రెడ్డితో పాటు చిన్నారులు ఆదిత్య, శ్రీనివాస్‌,సర్పంచ్ పురం రాజేశం మాధవి. ఉపసర్పంచ్ చంద్ర శేఖర్,సురేష్ ,పొద్దుపొడుపు శంకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular