అనాథ చిన్నారులకు డాక్టర్ మహేష్ రెడ్డి భరోసా పిల్లల చదువు, వైద్య బాధ్యతలు స్వీకరిస్తానని ప్రకటన
జనోదయ చొప్పదండి ఏప్రిల్ 17 : మండలంలోని చాకుంట గ్రామానికి చెందిన ఇద్దరు అనాథ చిన్నారులను ఆదుకునేందుకు కరీంనగర్ వన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి ముందుకొచ్చారు. తల్లిదండ్రులను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆదిత్య, శ్రీనివాస్ అనే ఇద్దరు సోదరుల దైన్య స్థితిని తెలుసుకున్న ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుల ఇంటికి వెళ్లి వారి పరిస్థితిని సమీక్షించిన డాక్టర్, ఆ పిల్లల పూర్తి విద్యా, వైద్య ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న చిన్నారులను అక్కున...