ePaper
Wednesday, June 10, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మంథనిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

మంథనిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

📰 Generate e-Paper Clip

రిపోర్టర్ అజయ్  మంథని (జనోదయ):

మంథని మండలం లక్కేపూర్ శివారు నుంచి మట్టి అక్రమ తరలింపు జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగుతుండడంతో వాటి ముసుగులో మట్టి మాఫియా రెచ్చి పోతున్నది.ఎలాంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ గట్టిగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఆదివారం, సెలవు దినాలు వస్తే చాలు తెల్లవారుజాము నుంచి మట్టి తరలింపుకు తెర లేపుతున్నారు. ఆదివారం మంథని మునిసిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు శ్రీపాద కాలనీ, నాలుగవ వార్డు గంగాపురి గ్రామంలో మట్టిని తరలించారు. సదరు విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియపరచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పరిస్థితి ఎలా ఉందంటే యథా రాజా తథా ప్రజా అన్న చందంగా ఉంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular