ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్గంగాధర: పోలీస్‌ల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

గంగాధర: పోలీస్‌ల ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

📰 Generate e-Paper Clip

 

గంగాధర, మార్చి 27 (జనోదయ):

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28వ తేదీన గంగాధర మండలం మధురానగర్ గ్రామంలోని VAS గార్డెన్స్‌లో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కార్యక్రమం కరీంనగర్ కమిషనర్ CP గౌస్ ఆలం ఆధ్వర్యంలో జరుగుతుందని, సర్కిల్ పోలీస్ అధికారులు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాల డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు చాలా అవసరమని, రోడ్డు ప్రమాదాల నివారణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

అందువల్ల ప్రాంతంలోని ఆటో, ట్రాక్టర్, లారీ, బస్సు మరియు ఇతర వాహనాల డ్రైవర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular