ePaper
Tuesday, June 2, 2026
ads
📄 ePaper
Homeకరీంనగర్గంగాధరఎస్‌ఐగా పదోన్నతి పొందిన మొగిలి మల్లేశంకు ఘన సత్కారం

ఎస్‌ఐగా పదోన్నతి పొందిన మొగిలి మల్లేశంకు ఘన సత్కారం

📰 Generate e-Paper Clip

గంగాధర పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)గా విధులు నిర్వహిస్తున్న మొగిలి మల్లేశం ఎస్‌ఐగా పదోన్నతి పొందడంతో పాటు సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది మల్లేశం సేవలను కొనియాడుతూ, ఆయన క్రమశిక్షణ, విధి నిర్వహణలో చూపిన నిబద్ధతను ప్రశంసించారు. పదోన్నతి పొందినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సిరిసిల్లలో కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

మల్లేశం మాట్లాడుతూ తన సేవాకాలంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గంగాధర పోలీస్ స్టేషన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గంగాధర పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular