ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యుత్ షాక్‌తో మహిళా కూలి మృతి అనుమానాస్పద మృతిగా తండ్రి ఫిర్యాదు

విద్యుత్ షాక్‌తో మహిళా కూలి మృతి అనుమానాస్పద మృతిగా తండ్రి ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

 

జానోదయ మంచిర్యాల జైపూర్ :

జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో మహిళా రైతు కూలి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెడగొని అఖిల (27) పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

పౌనూర్ గ్రామానికి చెందిన తాటికొండ మల్లయ్య కు చెందిన పొలంలో కలుపు పనులు చేయడానికి అఖిలతో పాటు మరో ఐదుగురు మహిళా కూలీలు వెళ్లారు. ఈ సమయంలో పొలం గట్టుపై ఉన్న బోరు పైపుకు తాకడంతో అఖిలకు విద్యుత్ షాక్ తగిలి స్పృహ కోల్పోయి కింద పడిపోయినట్లు సమాచారం.

అక్కడ ఉన్న వారు వెంటనే ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తన కుమార్తె అఖిల మృతి అనుమానాస్పదంగా ఉందని మృతురాలి తండ్రి కొమురయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. కాగా అఖిలకు పౌనూర్ గ్రామానికి చెందిన మేడగొని శ్యామ్ తొ 2024లో వివాహం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular