విద్యుత్ షాక్‌తో మహిళా కూలి మృతి అనుమానాస్పద మృతిగా తండ్రి ఫిర్యాదు

  జానోదయ మంచిర్యాల జైపూర్ : జైపూర్ మండలంలోని పౌనూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో మహిళా రైతు కూలి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెడగొని అఖిల (27) పొలం పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. పౌనూర్ గ్రామానికి చెందిన తాటికొండ మల్లయ్య కు చెందిన పొలంలో కలుపు పనులు చేయడానికి అఖిలతో పాటు మరో ఐదుగురు మహిళా కూలీలు వెళ్లారు. ఈ సమయంలో పొలం గట్టుపై ఉన్న బోరు పైపుకు...