ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవరంగల్నీలి రాజ్య సైనికుడు చుంచు రాజేందర్

నీలి రాజ్య సైనికుడు చుంచు రాజేందర్

📰 Generate e-Paper Clip

సమ సమాజ స్థాపనే ఆయన లక్ష్యం!

ఎమ్మెస్పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ,

జేఎంఎం జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు,

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత పుట్ట రవి మాదిగ!

దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా చుంచు రాజేందర్ జన్మదిన వేడుకలు!

ఆయురారోగ్యాలతో ఉండి పేదలకు మరింత సేవ చేయాలన్న నాయకులు!

జీవితాంతం పేదల కోసం పోరాడుతానన్న చుంచు రాజేందర్!

జనోదయ, హనుమకొండ, మార్చి 07:
మహనీయుల బాటలో నిరంతరం ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూ నీలి రాజ్య స్థాపన కోసం పాటుపడుతున్న సైనికుడు చుంచు రాజేందర్ అని మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుడు మంద కుమార్ మాదిగ జాతీయ మాల మహానాడు ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత పుట్ట రవి మాదిగ పేర్కొన్నారు.హనుమకొండ లోని హరిత కాకతీయ హోటల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు . ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు చుంచు రాజేందర్ చేత కేకు కట్ చేయించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మందకుమార్ మాదిగ మన్నె బాబురావు పుట్ట రవి మాట్లాడుతూ మహనీయులు కలలు కన్నా అసమానతలు లేని సమసమాజమే లక్ష్యంగా చుంచు రాజేందర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి పేదలకు మరింత సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. చుంచు రాజేందర్ మాట్లాడుతూ తన జీవితాంతం పేద ప్రజల సమస్యలపై పోరాడుతూ ఈ దేశ మూలవాసుల ఆశయ సాధనమైన సమ సమాజం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అంకేశ్వరపు రాంచందర్ రావు, సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సాంబయ్య యాదవ్, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి మంద వర్ధన్ కుమార్, నాయకుడు నేరెళ్ల బసవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular