చుంచు రాజేందర్ డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మాదాసి సురేష్ పిఎస్ జెఎసి చైర్మన్
జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 28:
బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని అడుగడున ఉల్లంఘిస్తూ కూలీల గొంతు నొక్కుతుందని,
ఉపాధి హామీ కూలీల హక్కులను హరించేందుకు వీబీ గ్రామ్ జీ బిల్లు 2025 ను తీసుకువస్తుందని,
బిల్లు రద్దుకై ఉపాధి హామీ కూలీలు ఐక్యంగా ఉద్యమించి,ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్,ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ మాదాసి సురేష్ కూలీలకు పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా,ఆత్మకూర్ మండలం నాగయ్యపల్లి
గ్రామంలోని నాగయ్య చేరువులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి చట్టానికి జరిగే నష్టాలను వివరిస్తూ చట్టాన్ని కాపాడుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్,పిఎస్ జెఎసి జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ మాట్లాడుతూ
కేంద్రములో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా తీసివేసెందుకు,కూలీలను పనికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.ఉపాధి హామీ చట్టాన్ని యదవిధంగా కొనసాగించాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేశంలో వామపక్షాలు, సామాజిక ప్రజా సంఘాల తివ్రమైన ఒత్తిడితో వచ్చిన యం జి ఎన్ అర్ ఇజిఎను తీసివేసేందుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని అన్నారు.
కూలీలకు పని హక్కులను కల్పించిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబి గ్రామ్ జి బిల్లు 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందన్నారు.
దేశంలో రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం ఐక్య పోరాటం చేసి నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారన్నారు.
నాటి రైతుల స్ఫూర్తితో కూలీలు పోరాటం చేసి ఉపాధి హామీ పని హక్కులను రక్షించుకొవాలన్నారు.
దేశ వ్యాప్తంగా 33 కోట్ల కూలీల హక్కులను కాల రాస్తున్న బిజెపికి వ్యతిరేకంగా కూలీలు ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జెఎసి జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, ఉపాది హామీ కూలీలు మాదాసి బిక్షపతి,గిన్నారపు మస్తాన్,మాదాసి సూరయ్య, గుండాల మల్లస్వామి,గిన్నారపు బాబు,వనమాల,సుజాత,హైమ,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.





