అంబేద్కర్ విగ్రహానికి నివాళులార్పించిన రేచపల్లి సర్పంచ్ బాస మహేష్
జగిత్యాల ప్రతినిధి ఫిబ్రవరి 15:
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ కార్యవర్గ సభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామ సర్పంచ్ బాస మహేష్ పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమ నిర్వాహకుడు నల్ల శ్యామ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం, సామాజిక సంస్కరణలపై ఆయన ఆలోచనలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలుపుతూ, అంబేద్కర్ జీవితం, ఆశయాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం స్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రేచపల్లి గ్రామ సర్పంచ్ బాస మహేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం భారత రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. “విద్య పొందండి, సంఘటితంగా ఉండండి, పోరాడండి” అనే ఆయన సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం విలువలను ఆచరణలో పెట్టి సమాన భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ నిర్వాహకుడు నల్ల శ్యామ్ కు ముఖ్య అతిథి బాస మహేష్ అభినందనలు తెలుపుతూ, అంబేద్కర్ స్మరణ కార్యక్రమం బహుజనుల హక్కుల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తక్కళ్ళ దేవయ్య మట్టిపూలు పత్రిక సంపాదకులు, ఆనంతుల కాంతారావు తెలంగాణ శక్తి ఎడిటర్, మేనేని రవీందర్ రావు మనం జిల్లా స్థాపర్, మర్రిపల్లి శ్రీనివాస్ విజన్ ఆంధ్ర జిల్లా స్థాపర్, కంటె అంజయ్య ప్రధాన కార్యదర్శి పట్టణ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం, పులి నర్సయ్య ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు సంఘం,సుంకరిపల్లి అశోక్, దాసరి లచ్చయ్య మాజీ సర్పంచ్ సిరికొండ, బొల్లం ప్రభాకర్, సంకె మహేష్,చెనల్ల సుమన్,నల్ల సురేష్,బండ్ర శ్రీనివాస్ తదితర అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





