ePaper
Saturday, April 4, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్అధిక ధరలకు సిగరెట్ల విక్రయం…అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు?

అధిక ధరలకు సిగరెట్ల విక్రయం…అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నలు?

📰 Generate e-Paper Clip

బిల్లులు లేకుండా ఎంఆర్‌పీకి మించి అమ్మకాలు…
•కరోనా కాలంలో జరిమానాలు… ఇప్పుడు మౌనం ఎందుకు?

జనోదయ, పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి:

కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై భారీ పన్నులు విధిస్తూ, అక్రమ రవాణా–అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తుంటే, పెద్దపల్లి జిల్లాలో మాత్రం భిన్న దృశ్యం కనిపిస్తోంది. ముద్రిత ధర (ఎంఆర్‌పీ)కు అందుబాటులో ఉండాల్సిన సిగరెట్లు వినియోగదారులకు అధిక ధరలకు విక్రయమవుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.హోల్‌సేల్ స్థాయిలో సరఫరా లోపాల పేరుతో రిటైల్ దుకాణాల్లో ఒక్కో ప్యాకెట్‌పై రూ.35 నుంచి రూ.45 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా కాలంలో ఒక్కో సిగరెట్‌పై రూ.2 అదనంగా అమ్మినందుకు సేల్స్ ట్యాక్స్ అధికారులు దాడులు చేసి భారీ జరిమానాలు విధించిన ఘటనలు గుర్తుండగానే,ఇప్పుడు జరుగుతున్న అధిక ధరల వసూళ్లపై సంబంధిత శాఖలు ఎందుకు మౌనంగా ఉన్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది.బిల్లులు లేకుండా విక్రయాలు,వినియోగదారులపై అన్యాయ భారం—ఇవన్నీ బహిరంగ రహస్యాలుగా మారినా అధికార యంత్రాంగం కదలిక కనిపించకపోవడం ఆందోళనకరం.తనిఖీలు ఎప్పుడు? చర్యలు ఎక్కడ? ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular