ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్ గౌరవ సూచకంగా విగ్రహ ప్రతిష్ఠ ప్రతిపాదన

బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గౌడ్ గౌరవ సూచకంగా విగ్రహ ప్రతిష్ఠ ప్రతిపాదన

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 11:

మొట్టమొదటి బహుజన వీరుడు,బహుజన చక్రవర్తి,బహుజన నాయకుడిగా చరిత్రలో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కమాన్‌పూర్ మండల కేంద్రంలో ప్రతిష్ఠించేందుకు స్థలం కేటాయించాలని బుధవారం కమాన్‌పూర్ గౌడ కుల సంఘం అధ్యక్షులు నగునూరి నర్సయ్య గౌడ్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్,పంచాయతీ కార్యదర్శికి వినతి చేశారు.అప్పటి తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడించిన మొఘల్ పాలకుల ఆరాచకాలను,భూస్వాముల వారం గుత్తాధిపత్యాన్ని ధైర్యంగా ఎదిరించి ఏకంగా గోల్కొండ కోటను ఏలిన ధీరుడిగా పాపన్న గౌడ్ చరిత్రకెక్కారు.

భావితరాలకు ఆయన గొప్పతనం,స్వాభిమాన పోరాట స్ఫూర్తి చేరవేయాలన్నదే ఈ విగ్రహ ప్రతిష్ఠ ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు పేర్కొన్నారు.కమాన్‌పూర్ మండల కేంద్రంలో అనువైన స్థలాన్ని కేటాయించి విగ్రహ స్థాపనకు సహకరించాలని వారు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో గౌడ కుల సంఘం ఉపాధ్యక్షులు పొన్నం చిన్నవెంకన్న గౌడ్,గౌడ కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular