🔹వార్డులో ఇంటింటి పర్యటన చేసిన సర్పంచ్
జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 3:
కమాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని 12వ వార్డులో మంగళవారం ఉదయం సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ఇంటింటి పర్యటన చేపట్టి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, పరిష్కారాలకు ప్రాధాన్య క్రమం రూపొందిస్తామని తెలిపారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గోడిశెల లింగస్వామి, తూటి రాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి వేగవంతమవుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.





