జనోదయ,గంగాధర ఫిబ్రవరి 3:
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిప్ప భూలక్ష్మీ, కొలకాని ప్రభాకర్ కుటుంబాలను టీఎల్ యువసేన అధినేత తూడి లచ్చన్న పరామర్శించి మానవతా స్పూర్తిని చాటుకున్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన తన వంతు సహాయంగా రెండు కుటుంబాలకు తలసరి రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో యువసేన ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు, ఉపసర్పంచ్ దాది లావణ్య–హరీష్, మాజీ ఎంపీటీసీ తడిగోప్పుల రమేష్, రజక సంఘం అధ్యక్షుడు లింగంపల్లి అనిల్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, రజక సంఘం సభ్యులు, యువసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఐక్యత, సహానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఈ కార్యక్రమం నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చే ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో ప్రేరణగా నిలవాలని వారు పేర్కొన్నారు.







