బాధిత కుటుంబాలకు టీఎల్ యువసేన చేయూత
జనోదయ,గంగాధర ఫిబ్రవరి 3: గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన చిప్ప భూలక్ష్మీ, కొలకాని ప్రభాకర్ కుటుంబాలను టీఎల్ యువసేన అధినేత తూడి లచ్చన్న పరామర్శించి మానవతా స్పూర్తిని చాటుకున్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఆయన తన వంతు సహాయంగా రెండు కుటుంబాలకు తలసరి రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి, కష్టకాలంలో యువసేన ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ...