ePaper
Saturday, April 4, 2026
ads
📄 ePaper
Homeమంథనిబీఆర్ఎస్‌కు షాక్ – కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ,మాజీ చైర్మన్

బీఆర్ఎస్‌కు షాక్ – కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ,మాజీ చైర్మన్

📰 Generate e-Paper Clip

జనోదయ,మంథని ఫిబ్రవరి 8:

బిఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు బిఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

వారితో పాటు రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతీ, రాదంటి శంకర్‌లు కూడా మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ చేరికలు మంథని నియోజకవర్గ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు కొత్త బలం చేకూర్చినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్యంత సంతోషకరమని అన్నారు. మంథని పట్టణంతో పాటు మంథని నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ఈ నాయకులు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీల అభివృద్ధి కోసం వారి అనుభవం, సూచనలు, సలహాలను పూర్తిగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు.

రానున్న రోజుల్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల పక్షాన నిలిచే రాజకీయాన్ని కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

మొత్తంగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జరిగిన ఈ చేరికలు నియోజకవర్గ రాజకీయాలకు కొత్త దిశను సూచిస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కలిగించే అవకాశాలు ఉన్నాయని ప్రజల్లో చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular