ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్కమాన్‌పూర్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

కమాన్‌పూర్‌లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 17:

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు మండల శాఖ అధ్యక్షుడు తాటికొండ శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన అందించిన దిశానిర్దేశం, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని కొనియాడారు. తెలంగాణను దేశంలో ముందంజలో నిలిపే విధంగా పాలన అందించారని అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular