జనోదయ,హైదరాబాద్ ఫిబ్రవరి 4:
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది స్వప్న (34) దారుణ హత్యకు గురికావడం తీవ్ర సంచలనంగా మారింది. దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనతో గ్రామంతో పాటు నగరవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.





