కమాన్‌పూర్,మార్చి 25:
కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ఓల్డ్ అంబేద్కర్ నగర్‌కు చెందిన చిప్పకుర్తి రాజశేఖర్ తీవ్ర అనారోగ్యంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. గాళ్బ్లాడర్ సమస్యతో పాటు కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనకు అత్యవసరంగా రక్తం అవసరమని వైద్యులు సూచించారు. ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఛత్రపతి శివాజీ యువసేనను సంప్రదించగా, సంస్థ వెంటనే స్పందించి సహాయం అందించింది.
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకేసారి ముగ్గురు యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషంగా నిలిచింది. ముస్కెహరి కృప, ఎలువక గణేష్, మాటేటి చింటూ (రాజ్) రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న బాధితుడికి ప్రాణాధారం అయ్యారు.
ఆపదలో ఉన్నవారికి వెంటనే స్పందించి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని యువసేన సభ్యులు తెలిపారు. రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని ప్రతిబింబిస్తాయని వారు పేర్కొన్నారు.
రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. యువత ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పలువురు పిలుపునిస్తున్నారు.





