జనోదయ, పెద్దపల్లి జూన్ 13 :
పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా ఎస్‌ఐ కె. నరేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ కె. నరేష్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.
నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. పోలీసు శాఖపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా విధులు నిర్వహిస్తానని చెప్పారు.





