జనోదయ, మందమర్రి మార్చి 9:
సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు నలువాల సమ్మయ్య యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలెంట్ కల్చరల్ ఆర్ట్స్, సమిష్టి చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వల్లభాపురపు సూర్యనారాయణ, పున్నమ్మ, ధరణికోట తిమోతి ల జ్ఞాపకార్థం శ్రీ చైతన్య పాఠశాలలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటు కుంటున్నారన్నారు. సమాజ కట్టుబాట్ల వల్ల ఒకప్పుడు వంటింటికే పరిమితం అయిన మహిళల్లో డా,, బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వంటి వారు మహిళలలో చైతన్యం నింపారని ఆయన గుర్తు చేశారు. మొట్టమొదటి మహిళా డాక్టర్ గా విశేష సేవలందించిన డాక్టర్ ఆనందీబాయి జోషి, అంతరిక్ష ప్రయాణం చేసిన కల్పనా చావ్లా, తొలి మహిళా
ఐపీఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ తదితరులు మహిళా లోకానికి ఆదర్శప్రాయులుగా నిలిచారన్నారు. అనంతరం వివిధ రంగాలలో సేవలందించి ఆదర్శంగా నిలిచిన పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి భవాని,ఉపాధ్యాయురాలు జి పుష్పలత, న్యాయవాది వకుల, మహిళ కానిస్టేబుల్ పి సౌజన్య, కూచిపూడి నృత్య గురువులు కాపూడి వసుధ, గట్టు శ్రావణి లకు నారీశక్తి పురస్కారాలు అందచేశారు. శ్రీ చైతన్య పాఠశాల మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. సంస్థ నిర్వహుకులు సునార్కర్ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు డాక్టర్ ఉదారి చంద్రమోహన్ గౌడ్, డా,, బాలాజీ, పాఠశాల ప్రిన్సిపాల్ ఎం రమేష్, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ ఇంచార్జి నూకల సునీత, తిరుమల, హెప్సిబా, సాహిత్య, శిరీష, దివ్య లు పాల్గొన్నారు.





