జనోదయ,హనుమకొండ (శాయంపేట) ఫిబ్రవరి12:
హనుమకొండ జిల్లా శాయంపేట మండల ప్రత్తిపాక గ్రామంలో చిర్రకుంట వద్ద బుధవారం ఉపాధి హామీ పనులను సర్పంచ్ గజ్జి ఐలయ్య, ఉపసర్పంచ్ తుడుం రాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కూలీలందరికీ ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని,అర్హులైన ప్రతి కూలీకి పని కల్పించి,ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొర్రే రాజారాం,టెక్నికల్ అసిస్టెంట్ ప్రశాంత్,పీల్డ్ అసిస్టెంట్ పెండేల కుమారస్వామి, సీనియర్ మేట్ పోతుగంటి సాంబరాజు వార్డు మెంబర్లు నాలికే వీర ప్రతాప్,పోతుగంటి ప్రమీల సారయ్య,అంకేశ్వరపు సాయి లక్ష్మి మొగిలి, కోడిమాల మహేందర్,గజ్జి రమేష్, గజ్జి రాజు,గడ్డమీది హారతి కరుణాకర్, ఐరబోయిన స్వప్న రాజు, కందగట్ల ప్రవీణ్ కుమార్, తుడుం స్రవంతి రాజు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.





