ePaper
Saturday, April 4, 2026
ads
📄 ePaper
Homeరామగుండం55వ డివిజన్‌లో బీఆర్ఎస్ గడపగడప ప్రచారం జోరు

55వ డివిజన్‌లో బీఆర్ఎస్ గడపగడప ప్రచారం జోరు

📰 Generate e-Paper Clip

🔹కర్క పద్మ (సుజాత)–శ్రీనివాస్ ప్రచారానికి ప్రజల స్పందన

🔹బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుకంటి చందర్

🔹కారు గుర్తుపై ఓటుతోనే అభివృద్ధి – కొప్పుల ఈశ్వర్ పిలుపు

జనోదయ,రామగుండం ఫిబ్రవరి 7:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.ఈ ఎన్నికల్లో భాగంగా శనివారం 55వ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కర్క పద్మ (సుజాత)–శ్రీనివాస్ నిర్వహించిన గడపగడప ప్రచార కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ పాల్గొని పార్టీ శ్రేణులకు ఉత్సాహం నింపారు.

ప్రచార సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ,బీఆర్ఎస్ పాలనలో రామగుండం ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందని గుర్తు చేశారు.మౌలిక వసతులు,సంక్షేమ పథకాలు,పట్టణాభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమయ్యాయని చెప్పారు.ప్రజల సమస్యలను ఇంటింటికీ వెళ్లి తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపుతున్న బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

అభ్యర్థి కర్క పద్మ (సుజాత)–శ్రీనివాస్ మాట్లాడుతూ,డివిజన్ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు.మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలిచిందని పేర్కొంటూ,ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మొత్తంగా 55వ డివిజన్‌లో జరిగిన ఈ ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ,ఎన్నికల వేడిని మరింత పెంచింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular