ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మండు వేసవిలో అంది వచ్చిన అతిథి కర్బూజా

మండు వేసవిలో అంది వచ్చిన అతిథి కర్బూజా

📰 Generate e-Paper Clip

విరివిగా పెరిగిన కర్బూజా అమ్మకాలు

వేసవి తాపానికి విరగబడి కొంటున్న ప్రజలు

రిపోర్టర్ అజయ్ మంథని జనోదయ :

ఎండాకాలం మండువేసవిలో స్వాంతన చేకూర్చే సీజనల్ కాయలు కర్బూజా. దినచర్యలో భాగంగా ఎండలో పనిచేసే వారికి మిట్ట మధ్యాహ్నం డిహైడ్రేషన్ కు గురికాకుండా పుచ్చకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని పండ్ల వ్యాపారులు ఈ వేసవిలో లోడ్లకొద్ది కర్బుజా కాయలు మార్కెట్లకు తీసుకువస్తున్నారు. గతంలో కర్బూజా కాయ కిలో రూ. 40 ఉండగా ఈ వేసవిలో రూ. 50 కి రెండు వందకి మూడు సైజులను బట్టి గ్రేడింగ్ చేసి అమ్ముతున్నారు. ఈసారి కర్బూజా కాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడంతో ఎగబడి కొంటున్నారు. కర్బూజా కాయలను ఇంటిల్లిపాదితో తిని వేసవి తాపా నుండి ఉపశమనం పొందుతున్నారు.

తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పుచ్చకాయ, ఖర్బూజ రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే ఒకేసారి ఎక్కువగా తినకపోవడమే మంచిది. తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు తగ్గించి తినాలి. పుచ్చకాయ అయినా, ఖర్బూజ అయినా కట్ చేసిన వెంటనే తినడం మంచిది. ఫ్రిడ్జ్​లో పెడితే 24 గంటల్లోపు తినేయాలని అంటున్నారు. వీటిని జ్యూస్​ల రూపంలో తీసుకోవచ్చు. కానీ షుగర్ వేసుకోకుండా చేసుకుంటే మంచిది. నేరుగా తినడం ఇష్టం లేనివారు, కుదరలేని వారు.. జ్యూస్​ల రూపంలో తీసుకోవచ్చు. అలాగే ప్యాక్డ్​ డ్రింక్స్​ కాకుండా.. తాజాగా చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

పుచ్చకాయ ప్రయోజనాలు..

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనిలో కూడా విటమిన్ ఎ, సి ఉంటాయి. లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. వేసవిలో దీనిని తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ సమస్య దూరమవుతుంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular