ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెద్దపల్లివిధుల పట్ల నిర్లక్ష్యం..

విధుల పట్ల నిర్లక్ష్యం..

🔹చైన్‌మెన్ ఈ.రఘు సస్పెండ్

📰 Generate e-Paper Clip

జనోదయ,పెద్దపల్లి/మంథని ఫిబ్రవరి 4:

విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించిన చైన్‌మెన్ ఈ. రఘును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఈ.రఘు,విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మంథని ఆర్‌డీఓ నివేదికలో పేర్కొన్నారు. పలుమార్లు మెమోలు జారీ చేసినప్పటికీ మార్పు కనిపించకపోవడం, జనవరి 13, 2026 నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరు కావడం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా సస్పెన్షన్ విధిస్తూ, ఈ కాలంలో అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ దాటరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular