ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్క్యాన్సర్ బాధితుడికి చేయూత – రూ.15 వేల ఆర్థిక సహాయం

క్యాన్సర్ బాధితుడికి చేయూత – రూ.15 వేల ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

మానవత్వాన్ని చాటిన మధురానగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు

గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గీకురు అంజయ్య గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం వారికి కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఆదిపెళ్లి పృథ్వీధర్ గౌడ్ గారు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి మధురానగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్న వెంటనే మధురానగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు స్పందించి తమ వంతు సహాయంగా రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి బాధితుడు గీకురు అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది చేయాలని వారు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular