కరీంనగర్ జిల్లాలో క్వాక్ క్లినిక్‌పై DCA దాడులు
అక్రమంగా నిల్వ చేసిన మందులు స్వాధీనం
గంగాధర | ఫిబ్రవరి 08, 2026
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు క్వాక్ క్లినిక్‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అర్హతలేని వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి, అక్రమంగా నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు.
“హిమ బిందు ఫస్ట్ ఎయిడ్ సెంటర్” పేరుతో కొనసాగుతున్న ఈ క్లినిక్‌లో డ్రగ్ లైసెన్స్ లేకుండా 73 రకాల మందులు, వాటిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ తదితర ఔషధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసిన మందుల విలువ రూ.27,879/-గా అంచనా వేశారు.
అర్హతలేని వ్యక్తులు అధిక శక్తి యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వినియోగించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని DCA హెచ్చరించింది. మందుల నమూనాలను పరీక్షల కోసం పంపించి, నివేదికల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.





