ఘనంగా శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం
జనోదయ,రామగిరి మార్చి 19: రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం శ్రీ గోవర్ధనగిరి వేణు మనోహరాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆచార్యులు నూతన సంవత్సరానికి సంబంధించిన పంచాంగ విశేషాలను విశదీకరిస్తూ గ్రహగతులు, రాశి ఫలితాలు, శుభ ముహూర్తాలపై భక్తులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. కొత్త సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ఆహ్వానిస్తూ జీవన ప్రయాణాన్ని శ్రేయోమార్గంలో కొనసాగించాలనే సందేశాన్ని అందించారు....