విద్యార్థుల్లో ట్రాఫిక్ చైతన్యం – అడ్డగుంటపల్లిలో అవగాహన కార్యక్రమం

🔹హెల్మెట్ ప్రాముఖ్యతపై పోలీసుల స్పష్టమైన సందేశం జనోదయ, గోదావరిఖని ఏప్రిల్18: స్థానిక అడ్డగుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ హైస్కూల్‌లో ట్రాఫిక్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో ట్రాఫిక్ సబ్‌ఇన్‌స్పెక్టర్ హరి శేఖర్,ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత కీలకమని పేర్కొంటూ,హెల్మెట్ ధరించడం,సీట్ బెల్ట్ వినియోగం,ఎడమ వైపున ప్రయాణించడం వంటి నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.మద్యం సేవించి వాహనం నడిపితే జైలు...