గంగపూరి వద్ద ట్రాక్టర్ ప్రమాదం – సమయానికి అందిన సహాయం
జనోదయ,మంథని ఫిబ్రవరి 8: ఆదివారం గంగపూరి సమీపంలో మంథని నుంచి సిద్ధపల్లి వైపు సిమెంట్ ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద ఒక కూలీ ఇరుక్కుపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు సంఘటనను గమనించి వెంటనే అక్కడ ఆగారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆయన క్షణాల్లోనే స్పందిస్తూ సహాయక చర్యలకు ముందుకు...