కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి.. బీఆర్ఎస్‌పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలి
గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మెచినేని నవీన్ రావు జనోదయ గంగాధర ఆగస్టు 07: గంగాధర మండలంలోని నారాయణపూర్ ముంపు గ్రామ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షులు మెచినేని నవీన్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటిస్తామని ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి నేటికీ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. ప్రజలు...