పాలితం శివారులో ఉద్రిక్తత – మట్టితవ్వకాలపై మండి పడ్డ ప్రజలు
🔹టిప్పర్లను నిలిపివేసిన గ్రామప్రజలు 🔹ఉపాధి హామీ పనులపై ముప్పు – కూలీల తీవ్ర నిరసన జనోదయ,పెద్దపల్లి ఏప్రిల్ 11: పెద్దపల్లి మండలం పాలితం గ్రామ రెవెన్యూ శివారులో మట్టి త్రవ్వకాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది.జీవనాధారంగా భావిస్తున్న ఉపాధి హామీ పనుల ప్రాంతంలోనే మట్టి తరలింపులు కొనసాగుతుండటంతో గ్రామస్థులు,కూలీలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిప్పర్లను అడ్డుకున్నారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల ప్రదేశాన్నే లక్ష్యంగా చేసుకుని మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇలా గుట్టలను త్రవ్వివేస్తే భవిష్యత్తులో ఉపాధి...