ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ‘టెక్నో స్పార్క్–2కే26’ జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 21: పెద్దపల్లి పట్టణంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ‘టెక్నో స్పార్క్–2కే26’ పేరుతో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. దేశ రక్షణ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ మధుసూదన్ రెడ్డి (మాజీ డైరెక్టర్–డిఎంఆర్ఎల్,డిఆర్డిఓ; బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రధాన సలహాదారు) ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రాజెక్ట్ ప్రదర్శనను ఆరంభించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్...