కట్టుదిట్టమైన భద్రతల మధ్య స్ట్రాంగ్ రూమ్,లెక్కింపు కేంద్రాలు : డీసీపీ రామ్ రెడ్డి

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 9: కట్టుదిట్టమైన భద్రతల మధ్య మున్సిపల్ ఎన్నికల తదుపరి ప్రక్రియలు సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ అనంతరం జరిగే బ్యాలెట్ బాక్సుల భద్రత,లెక్కింపు ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న స్వీకరణ,పంపిణీ కేంద్రాలు,అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల,పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భద్ర గది,లెక్కింపు కేంద్రాలను డీసీపీ స్వయంగా పరిశీలించారు.ఈ తనిఖీల్లో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్,గోదావరిఖని...