బీఆర్ఎస్‌కు షాక్ – కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీపీ,మాజీ చైర్మన్

జనోదయ,మంథని ఫిబ్రవరి 8: బిఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకులు బిఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎంపీపీ మదాడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి, రామడుగు మారుతీ, రాదంటి శంకర్‌లు...