janodaya.in
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 5:32 pm Digital Edition : JANODAYA MEDIA

సేవకు సలాం.. లైన్‌మెన్ ఓదెలును సత్కరించిన ఉపసర్పంచ్ రఫీక్ సోహెల్

జనోదయ, కమాన్‌పూర్ ఆగస్టు 18:

కమాన్‌పూర్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న కె. ఓదెలు ఇటీవల జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం గ్రామ ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్ సోహెల్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కమాన్‌పూర్ ఏఈ (ఎలక్ట్రికల్)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టీ. స్వామిని కూడా శాలువాతో సన్మానించి అభినందించారు. విద్యుత్‌ సేవలను ప్రజలకు మెరుగ్గా అందించేందుకు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మిట్ట సందీప్, గుంజపడుగు నవీన్, పచ్చునూరి రాజ్‌కుమార్, తూటి రాజు, నాయకులు బోగే రమేష్, మల్లారపు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.