ఉప్పరమల్యాల లో రోడ్డు ప్రమాదం… అక్కడికక్కడే యువకుడి మృతి

జనోదయ,గంగాధర ఫిబ్రవరి 11: గంగాధర మండలంలో మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో  చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.మండలంలోని తాడిజెర్రి గ్రామానికి చెందిన శ్రీరాం మహేష్ (35) ఉప్పరమల్యాల–రంగారావుపల్లి గ్రామాల మధ్య జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం,మహేష్ కొద్ది రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చారు. కుటుంబం గంగాధర ప్రధాన కూడలిలో నివాసం ఉంటోంది.తాడిజెర్రి నుంచి గంగాధర వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వాహనం అదుపుతప్పి పడిపోయిందా? లేక మరేదైనా వాహనం...