జర్నలిస్టుల కుటుంబాలకు విద్యా భరోసా కల్పించండి
🔹జిల్లా కలెక్టర్‌కు టీయూడబ్ల్యూజేహెచ్-143 ప్రతినిధుల వినతి జనోదయ పెద్దపల్లి ప్రతినిధి, జులై 27: పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న అక్రిడేటెడ్, నాన్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో రాయితీ విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజేహెచ్-143 జాతీయ కౌన్సిల్ సభ్యుడు, పెద్దపల్లి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు అంకరి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను కోరారు. సోమవారం టీయూడబ్ల్యూజేహెచ్-143 ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 500 మంది...