janodaya.in
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 2:15 pm Digital Edition : JANODAYA MEDIA

యూనిక్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు

జనోదయ గంగాధర ఆగస్టు 19:

గంగాధర యూనిక్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలను ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఫోటోగ్రాఫర్లను ఈ సందర్భంగా సత్కరించారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం వృత్తి మాత్రమే కాకుండా, సమాజంలోని ముఖ్యమైన సంఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే కళ అని సభ్యులు పేర్కొన్నారు.

యూనియన్ సభ్యులు పరస్పరం సహకరించుకుంటూ ఫోటోగ్రఫీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో గంగాధర యూనిక్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.