janodaya.in
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 10:04 am Digital Edition : JANODAYA MEDIA

సెప్టెంబర్ 9న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి “జాతీయ సదస్సు”

-కుల వివక్ష లేని సమాజం కోసం నూతన కమిటీలు

-ఎంఎస్పి జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగూరి ఆనంద్ రావు మాదిగ

జనోదయ వరంగల్ ప్రతినిధి: జూలై 28

మత దురహంకారం, కుల వివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం పోరాడుదామని ఎంఎస్పి జాతీయ నాయకులు, వరంగల్ జిల్లా ఇంచార్జి వంగూరి ఆనంద్ రావు మాదిగ పిలుపునిచ్చారు. కాశిబుగ్గ, లక్ష్మీపురం కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెప్టెంబర్ 09, 2026న జాతీయ నాయకులతో భారీ సదస్సు నిర్వహిస్తున్నామని, దానికి ముందు సెప్టెంబర్ 20 లోపు జిల్లా, మండల, గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. రాజ్యాంగ స్ఫూర్తితో కుల దురహంకారంపై పోరాడేందుకు నూతన కమిటీలు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కట్ల రాజశేఖర్ మాదిగ అధ్యక్షత వహించగా, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు కన్నూరి చంద్రశేఖర్ మాదిగ, మాసాని గోపాల్, ధర్మన్న, గంగారాపు మల్లన్న, ప్రమోద్, మల్లేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.