కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కోసం వన్ హాస్పిటల్ చైర్మన్ అండ్ డైరెక్టర్ మర్రి మహేష్ రెడ్డి రూ.25,000 అందజేశారు.
గ్రామంలో శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన చేపడుతున్న విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన శివాజీ యూత్ సభ్యులను కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మర్రి మహేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామ భాస్కర్ రెడ్డి , శివాజీ యూత్ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.