లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మంథని సబ్ రిజిస్ట్రార్
జనోదయ,మంథని,ఫిబ్రవరి 20: పెద్దపల్లి జిల్లా మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి మరోసారి బహిర్గతమైంది. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుకూలంగా పూర్తి చేయాలంటే రూ.16,500 ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగేబలంగా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు పన్నిన పన్నాగం ఫలించింది. సాయంత్రం 3.35 గంటల సమయంలో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్ ద్వారా లంచం స్వీకరించిన వెంటనే అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్వీకరించిన మొత్తాన్ని స్వాధీనం...