నేత్రదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచిన మల్యాల రాధమ్మ

జనోదయ,రామగిరి ఫిబ్రవరి 21: కల్వచర్ల గ్రామానికి చెందిన మల్యాల రాధమ్మ మరణానంతరం ఆమె కుటుంబ సభ్యులు తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. రాధమ్మ నేత్రాలను దానం చేసి సమాజానికి మానవతా సందేశం ఇచ్చారు. మరణం అనంతరం కూడా జీవితాలను వెలిగించవచ్చని ఈ కుటుంబం చూపించింది. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో క్లబ్ డైరెక్టర్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకట రమణ రెడ్డి సమన్వయంతో, సదాశయ ఫౌండేషన్ సహకారంతో నేత్రదానం కార్యక్రమం నిర్వహించారు. ల్యాబ్ టెక్నీషియన్ ప్రదీప్...