గ్రామాభివృద్ధికి చట్టపరమైన అవగాహన కీలకం – కమాన్‌పూర్‌లో నూతన ప్రజాప్రతినిధులకు శిక్షణ
జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 17: కమాన్‌పూర్ మండల పరిషత్ కార్యాలయం మంగళవారం ప్రజాస్వామ్య బాధ్యతల పాఠశాలగా మారింది.రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు–2026లో గెలుపొందిన ఉపసర్పంచులు,వార్డు సభ్యులకు చట్టపరమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ శిక్షణ 21 ఫిబ్రవరి 2026 వరకు కొనసాగనుంది.గ్రామ పాలనలో పారదర్శకత,సమర్థత,ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. మండల అభివృద్ధి అధికారి ప్రియాంక మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రతి ప్రజాప్రతినిధి చేతిలో ఉండాల్సిన మార్గదర్శక గ్రంథమని పేర్కొన్నారు.సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యుల అధికారాలు,బాధ్యతలు,నాయకత్వ...