ఉత్సాహంగా కమాన్‌పూర్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్స్ వేలం – క్రీడాస్ఫూర్తికి కొత్త ఊపు

జనోదయ,కమాన్‌పూర్ ఏప్రిల్ 9: కమాన్‌పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ శ్రీపాదరావు స్మారకార్థంగా నిర్వహిస్తున్న కమాన్‌పూర్ ప్రీమియర్ లీగ్ (KPL) సీజన్–1లో భాగంగా ప్లేయర్స్ వేలం కార్యక్రమం గురువారం సాయంత్రం కేఎన్ ఫంక్షన్ హాల్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కమాన్‌పూర్ ఎస్‌ఐ కొట్టే ప్రసాద్ టోర్నమెంట్ మొదటి, ద్వితీయ బహుమతులను ఆవిష్కరించారు. యువత క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, చెడు...