రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ చూపిన కమాన్‌పూర్ క్రీడాకారిణి

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 21: కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడల్లో ప్రతిభ చాటుతూ బంగారు పతకం సాధించింది. శనివారం హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో జరిగిన 18 సంవత్సరాల విభాగం 400 మీటర్ల పరుగుపందెంలో ఆమె అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నల్లవెల్లి శంకర్–భారతి దంపతుల రెండవ కుమార్తె అయిన ఆనంది ప్రస్తుతం కమాన్‌పూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. క్రమశిక్షణతో కూడిన సాధన, కోచ్ మార్గదర్శకత్వం ఆమె విజయానికి పునాది అయ్యాయి. ఆనంది...