ఎన్నికల వరకు అధ్యక్షుడిగానే కొనసాగుతా

🔹తొలగింపు తీర్మానం చెల్లదన్న న్యాయస్థానం 🔹బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 17: పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదం హైకోర్టు తీర్పుతో కొత్త మలుపు తీసుకుంది.ఎన్నికలు జరిగే వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగుతానని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్ స్పష్టం చేశారు.ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత 25 సంవత్సరాలుగా న్యాయవాదిగా సేవలందిస్తున్న తాను బార్ అసోసియేషన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించానని పేర్కొన్నారు.ఆరు సార్లు కార్యదర్శిగా,మూడుసార్లు...