గ్రామాభివృద్ధి దిశగా సర్పంచులకు మార్గదర్శనం – ఐదు రోజుల శిక్షణ విజయవంతం

జనోదయ,పెద్దపల్లి ప్రతినిది ఫిబ్రవరి 24: పెద్దపల్లి పట్టణంలోని మదర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం నిర్వహించిన రెండో దశ ఐదు రోజుల ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అంతర్గాం,ధర్మారం,ఎలిగేడ్,జూలపల్లి,మంథని,ముత్తారం(మంథని)మరియు రామగిరి మండలాలకు చెందిన సర్పంచులు ఈ శిక్షణలో పాల్గొని పంచాయతీ పరిపాలనపై సమగ్ర అవగాహన పొందారు. ముగింపు సమావేశానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులకు కోర్సు పూర్తి సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సర్పంచ్ పదవి ప్రజల విశ్వాసానికి ప్రతీక అని,రాబోయే ఐదేళ్లలో గ్రామాభివృద్ధిని...