పెంచికల్ పేట్‌లో నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం
జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 16: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కమాన్‌పూర్ మండలంలోని పెంచికల్ పేట్ గ్రామంలో నిర్వహించిన నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగి విజయవంతంగా ముగిసింది.రాత్రి వేళ వెలుగుల మధ్య సాగిన ఈ పోటీల్లో క్రీడాకారుల అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగగా,గ్రామ యువతలో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. ఈ టోర్నమెంట్‌కు ప్రధాన ప్రాయోజకుడిగా వ్యవహరించి క్రీడలను ప్రోత్సహించిన అయిలవేని మల్లేష్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.పోటీలను క్రమశిక్షణతో నిర్వహించిన రాజు,రాకేష్,శ్రీధర్,విష్ణు లు అభినందనలు అందుకున్నారు.వారి సమన్వయంతో టోర్నమెంట్ సజావుగా కొనసాగింది. పోటీల్లో...