ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఘనోత్సవం
🔹అంగరంగ వైభవంగా సాగిన శివరాత్రి వేడుకలు 🔹చిన్నారుల నృత్యాలతో కనువిందు చేసిన శివరాత్రి వేడుకలు జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 16: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కమాన్‌పూర్ మార్కెట్ ఏరియాలో ఆదివారం నిర్వహించిన ఉత్సవాలు భక్తి,సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి. ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో సాగి స్థానికులను ఆకట్టుకున్నాయి. పవిత్ర వేడుకలలో భాగంగా ఆర్కెస్ట్రా భక్తి గీతాలతో సభను పరవశింపజేసింది.శ్రీ శారద నృత్య కళాపీఠం ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా వివిధ...